Header Banner

సెలవు రోజైనా సేవలందిస్తోన్న ప్రభుత్వం! ఒక్క రోజు మాత్రమే.. రూ.5000 ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ ఛాన్స్!

  Fri Apr 11, 2025 21:05        Politics

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే ప్రజలకు శుభవార్త తెలిపింది. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పని చేయవు. అయితే ఈసారి రేపు రెండో శనివారం (శనివారం) కావడంతో, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా, సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ కోసం సాధారణంగా వసూలు చేసే అదనపు రూ.5000 ఫీజును రేపు మాత్రం తీసుకోకుండా, రెగ్యులర్‌ డేస్‌లా సేవలందించనున్నట్లు స్టాంప్‌ & రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

 

ఇదిలా ఉంటే, వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్టర్ చేసే అవకాశం కల్పించనున్నట్లు మంత్రివర్యులు నారా లోకేష్‌ వెల్లడించారు. మంగళగిరిలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని, అంతేకాకుండా పేదలకు ఇచ్చిన పట్టాలను వారు రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కును కూడా కల్పించనున్నట్లు తెలిపారు. అయితే ఈ అవకాశాన్ని ఆర్థిక అవసరాల కోసం దుర్వినియోగం చేయకుండా, ఇచ్చిన పట్టాలను విక్రయించవద్దని పేదలకు లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #APGovernment #RegistrationNews #PropertyRegistration #HolidayUpdate #AndhraPradeshNews #GoodNewsFromAP #StampAndRegistration #SubRegistrarOffice